కుటుంబ రాజకీయాలు నేను చేయను : జానారెడ్డి

by  |
కుటుంబ రాజకీయాలు నేను చేయను : జానారెడ్డి
X

దిశ, హాలియా : తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో తన కుటుంబ సభ్యులను ప్రోత్సహించలేదనీ…. ఆరోపణలు చేసేవారే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ లోని ఆయన నివాసంలో గుర్రంపూడు మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జాల చిన సత్తయ్యయాదవ్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈసందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. గత 35 ఏండ్లుగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రతి తండాకు రవాణా సౌకర్యం విద్యుత్ ,మంచినీటి,వసతిని కల్పించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. విద్యుత్, రహదారులు, తాగునీరు తదితర సౌకర్యాలు తన కృషితోనే వచ్చాయని గుర్తుచేశారు. సాగర్‌లో బీఈడి కళాశాల తరలిపోవడం ఇప్పటి పాలకుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.

Next Story

Most Viewed