ఏడాదిలో లక్ష విక్రయాలు: హ్యూండాయ్

by  |
ఏడాదిలో లక్ష విక్రయాలు: హ్యూండాయ్
X

దిశ, సెంట్రల్ డెస్క్: గత కొంతకాలంగా విక్రయాలు లేవని కార్ల తయారీలోని కంపెనీలన్నీ లబోదిబోమన్నాయి. కరోనా సంక్షోభంతో కొనేవారు లేక నష్టపోయాయమని చెప్పాయి. అయితే, హ్యూండాయ్ కంపెనీకి చెందిన వెన్యూ కారు మోడల్ మాత్రం భారీగా అమ్ముడుపోయినట్టు , ఏడాదిలో లక్ష కార్లను విక్రయించామని హ్యూండాయ్ కంపెనీ శుక్రవారం కంపెనీ వెల్లడించింది. సరిగ్గా ఏడాది క్రితం హ్యూండాయ్ వెన్యూ మోడల్ కార్ల విక్రయాలను కంపెనీ ప్రారంభించింది. అప్పటికే ఆటోరంగం మందగమన పరిస్థితులను ఎదుర్కొంటోంది. తర్వాత కరోనాతో ఆటోరంగం పూర్తిగా కుదేలైంది. అయినప్పటికీ ఈ మోడల్ కార్లు భారీగా అమ్ముడుపోయి ఆశ్చర్యపరిచాయి. దేశవ్యాప్తంగా మొత్తం 97,400 యూనిట్లను కంపెనీ విక్రయించింది. ఇతర దేశాల్లో మొత్తం 7,400 యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్ ప్రారంభం నుంచిఏ భారత వినియోగదారులను బాగా ఆకట్టుకుందని, 2020కి ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుందని కంపెనీ తెలిపింది. హ్యూండాయ్ వెన్యూ మోడల్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ప్రమాణాల విషయంలో రాజీ పడలేదని, భద్రత విషయంలోనూ నాణ్యత కలిగి ఉందని, ముఖ్యంగా యువత మెచ్చేలా వెన్యూ మోడల్ ఉందని కంపెనీ వివరించింది. ఇక, ఇండియన్ మార్కెట్లో హ్యూండాయ్ వెన్యూ తర్వాత మారుతీ సుజుకి కంపెనీకి చెందిన విటారా బ్రెజా, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, కియా సొనెట్ కార్ మోడలు పోటీ పడుతున్నాయి.



Next Story

Most Viewed