హుజురాబాద్ మాదే : కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్

by  |
Huzurabad Congress candidate Balmuri Venkat
X

దిశ, యాదగిరిగుట్ట: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గురువారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి లడ్డును వెంకట్‌కు అందజేశారు. అనంతరం వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకున్నది విద్యార్థులు, నిరుద్యోగుల కోసమే అని, నేడు రాష్ట్రంలో వాళ్లకే ఎక్కువగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చి, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని అన్నారు.

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఆలయ సందర్శనలో వెంకట్ వెంట యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, కాంగ్రెస్ నేతలు గుళ్లపల్లి భరత్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story