భార్య తీరుపై మనస్తాపంతో విషం తాగి..!

by  |
భార్య తీరుపై మనస్తాపంతో విషం తాగి..!
X

దిశ, వెబ్‌డెస్క్: భార్య ప్రవర్తన తీరుతో విసుగు చెందిన భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్ మహా నగరంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. నగరానికి చెందిన లోకేష్ ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యే ఇతనికి సౌజన్య అనే యువతితో వివాహం జరిగింది. కొంతకాలం హ్యాపీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో గొడవలు ప్రారంభయ్యాయి. దీంతో భార్య సౌజన్య లోకేష్‌పై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు లోకేష్‌ను పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేశారు. అంతేకాకుండా, భార్య అనవసరంగా తనపై తప్పుడు కేసులు పెడుతోందని మనస్తాపం చెందిన అతడు బుధవారం విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

అంతకుముందు తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని.. తన మిత్రుడుకి కాల్ చేసి వివరించాడు. అతను తొందరపడొద్దని పలుమార్లు వారించినా వినిపించుకోలేదు. కొద్దిసేపటికే విషం తాగుతూ చిత్రీకరించిన సెల్ఫీ వీడియా అతనికి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన పోలీసులు బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లోకేష్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Next Story

Most Viewed