భార్య బాత్ రూంలో ఆ పని చేస్తుండగా వీడియో తీసిన భర్త.. ఆమె పుట్టింటికి వెళ్లడంతో..

178
bath

దిశ, వెబ్‌డెస్క్: భార్యభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు కుడా గొడవలు జరగడం సాధారణం. ఇందులో వరకట్నంకు సంబంధించిన గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. తర్వాత మళ్లీ కొన్ని రోజులకు వారే కలిసిపోతుంటారు. ఇంకా కొంచైం కోపం ఎక్కువ ఉన్న స్త్రీలు అయితే అలిగి పుట్టింటికి వెళ్తారు. ఇంకొందరు ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. మరికొందరు విడాకులు తీసుకుంటారు.

తాజాగా మహరాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహరాష్ట్రలోని బీవండి గ్రామానికి చెందిన వ్యక్తికి అదే గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. కట్న కానుకలు బాగానే ఇచ్చారు. మొదట్లో వీరి కాపురం బాగానే సాగింది. కొన్ని రోజుల తర్వాత భర్త అదనపు కట్నం కావాలని భార్యను వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులు అధికమవడంతో యువతి పుట్టింటికి వెళ్లింది. భర్త ఆమెను బుజ్జగించి మళ్లీ ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత ప్లాట్ కొనాలి డబ్బు కావాలని వేధించాడు. దీనితో విసుగు చెందిన భార్య వరకట్న వేధింపుల కింద పోలీసు స్టేషన్‌లో కేస్ పెట్టింది. దీనితో భర్త కోపంతో రగిలిపోయాడు.

భార్య దగ్గరకు వెళ్లి మంచిగా నటించి కేసు వాపస్ తీసుకునేలా చేశాడు. అనంతరం ఆమెను మళ్లీ తన ఇంటికి తీసుకు వచ్చాడు. తర్వాత అతడిలోని వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఏ భర్త కూడా చేయనటువంటి పాడు పనిచేశాడు. రహస్యంగా భార్య స్నానం చేస్తున్న వీడియోలు తీసాడు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని భార్యను బెదిరించాడు. అదనపు కట్నం తీసుకురావాలని.. లేదంటే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీనితో యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. కోపంతో రగిలిపోయిన భర్త అన్నంత పనిచేశాడు. భార్య స్నానం చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు. అది చూసిన భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.