ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై రానున్న హిందూస్తాన్ యూనిలీవర్!

by  |
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై రానున్న హిందూస్తాన్ యూనిలీవర్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం అనంతరం అధునాతన సాంకేతిక విక్రయాలు ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయని, ప్రస్తుతం మార్కెట్లలో ఉన్న ధోరణులను నిశితంగా పరిశీలిస్తున్నామని హిందూస్తాన్ యూనిలీవర్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ మెహతా వాటాదార్లతో చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ-కామర్స్‌తో పాటుగా సరికొత్త ట్రేడింగ్ విధానాలపై దృష్టి సారించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆన్‌లైన్ విభాగాల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించామని, అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతామని ఆయన వివరించారు. కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా రిటైల్, ఈ-కామర్స్‌లలో సరికొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు ప్రయంతిస్తున్నట్టు స్పష్టం చేశారు. అలాగే, ఆన్‌లైన్‌లో ‘క్లీనీపీడియా’ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన జాగ్రత్తలను సూచిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, ఈ సమయంలో అవసరమైన బ్రాండ్‌లకు తగిన ప్రచారం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇకపోతే, హిందూస్తాన్ యూనిలీవర్ సీఈవో, ఎండీగా సంజీవ్ మెహతా 2018-19 ఆర్థిక సంవత్సరం కంటే గత ఆర్థిక సంవత్సరంలో 2.86 శాతం అధికంగా వేతనాన్ని తీసుకున్నారు. 2019-20లో సంజీవ్ వేతనం రూ. 19.42 కోట్లు ఉంది. అంతకుముందు ఇది రూ. 18.88 కోట్లుగా ఉండేది.

Next Story

Most Viewed