గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

by  |
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు తీపి కబురు. బంగారం ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయని చూస్తున్నవారికి ఇదే మంచి సమయం. దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. చాలా రోజుల తర్వాత పసిడి ధర పతనమయ్యింది. నిన్న ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,090 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840గా ఉంది. గత మూడు రోజుల వ్యవధిలో బంగారం ధర రూ.1500 తగ్గడం విశేషం. బంగారం కొనుగోలు చేయాలి అనే వారికి ఇదే మంచి సమయం. బంగారం ధర భారీగా పడిపోవడంతో వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. కొండెక్కిన వెండి దిగొచ్చింది. మార్కెట్లో వెండి ధర చూస్తే నిన్న రూ. 1500 పతనమైంది. దీంతో కిలో వెండి ధర రూ. 70,200గా ఉంది. ఇంకెందుకు లేటు వెంటనే వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేయండి.


Next Story