దీపికకు పోటీనిస్తున్న హృతిక్ కజిన్

by  |
దీపికకు పోటీనిస్తున్న హృతిక్ కజిన్
X

దిశ, వెబ్‌డెస్క్: రోషన్ ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ గ్రీకు దేవుడు హృతిక్ రోషన్ తన కజిన్ సిస్టర్‌ పష్మినా రోషన్‌ను లాంచ్ చేసేందుకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ రాజేష్ రోషన్ కూతురైన పష్మినను బిగ్ బ్యానర్ ద్వారా పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కరెక్ట్ స్టోరీ కోసం ఎదురు చూస్తుండటంతో కాస్త లేట్ అవుతుందనేది ఇండస్ట్రీ టాక్. కాగా తన టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంలో మాత్రం లేట్ చేయకూడదనుకున్న హృతిక్.. తన పుట్టినరోజునే సరైన అవకాశంగా భావించి పష్మిన డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. ఈ లవ్ లీ వీడియో ద్వారా పష్మినను అఫిషియల్‌గా ఇంట్రడ్యూస్ చేశాడు. ఫుల్ ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న పష్మిన.. బాజీరావు మస్తానీ సినిమాలో దీపికా పదుకొనే పాట ‘మోహె రంగ్ దో లాల్’పై చేసిన నృత్యం ఆకట్టుకోగా.. అమేజింగ్ డ్యాన్స్ స్కిల్స్‌కు కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.

కాగా వీడియో చూసిన నెటిజన్లు.. ప్రజెంట్ బాలీవుడ్ యంగ్ జనరేషన్‌ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, అనన్య పాండే, తారా సుతారియా, సారా అలీఖాన్‌లకు గట్టి పోటినిచ్చేలా ఉందంటున్నారు. కజిన్ పట్ల హృతిక్ చూపిస్తున్న కేరింగ్‌కు ఖుదోస్ చెప్తున్నారు ఫ్యాన్స్. ‘నా ప్రియమైన పష్మిన ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్‌లోనూ నువ్వు స్టార్.. నిర్మలమైన నవ్వు, సంతోషానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని విష్ చేసిన హృతిక్ నిజంగా బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చాడు కదా.

Next Story

Most Viewed