గూగుల్ ప్లే మ్యూజిక్‌కు వీడ్కోలు

by  |
గూగుల్ ప్లే మ్యూజిక్‌కు వీడ్కోలు
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ తన ‘గూగుల్ ప్లే మ్యూజిక్’కు వీడ్కోలు పలికింది. గూగుల్ ప్లే మ్యూజిక్‌ను రిమూవ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యూజర్లు ఎంతోమంది గూగుల్ ప్లే మ్యూజిక్‌ను గత దశాబ్ద కాలంగా వినియోగిస్తున్నారు. అయితే, అది తొలగించబడినప్పటికీ మ్యూజిక్ ప్లే లిస్ట్ నుంచి సాంగ్స్ వినొచ్చు. అది ఎలాగంటే..

గూగుల్ ప్లే మ్యూజిక్ నుంచి యూట్యూబ్ మ్యూజిక్‌‌కు ప్లే లిస్ట్‌ను తరలించొచ్చు. అలా ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత యూట్యూబ్ మ్యూజిక్‌లో కూడా సాంగ్స్ వినోచ్చు. కవర్ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ తన మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్‌ను 2019 మార్చిలో ప్రారంభించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో 500 మిలియన్ల మందికి పైగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇక గూగుల్ ప్లే మ్యూజిక్ నుంచి మ్యూజిక్ లైబ్రరీని యూట్యూబ్ మ్యూజిక్‌కు ఈజీగా తరలించొచ్చు.

– ముందుగా యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి.
– అందులో ‘ట్రాన్స్‌ఫర్’ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే..ప్లే మ్యూజిక్ హిస్టరీ, ప్లే లిస్ట్స్, అప్‌లోడ్స్, పర్చేజ్డ్ కంటెంట్ అన్నీ కూడా యూట్యూబ్ మ్యూజిక్‌కు మూవ్ అవుతాయి.
– ట్రాన్స్‌ఫర్ కంప్లీట్ అయిన తర్వాత మన మెయిల్‌కు ట్రాన్స్‌ఫర్ కంప్లీటెడ్ నొటిఫికేషన్ వస్తుంది.
– యూట్యూబ్ మ్యూజిక్‌ హోమ్ స్త్క్రీన్ మన లైక్స్/డిస్ లైక్స్, ప్లే లిస్ట్ ఆధారంగా అప్డేడెడ్ రికమండేషన్స్ చూపిస్తుంది.

Next Story

Most Viewed