ట్విట్టర్ సీఈవోకి ఎంత జీతముంటుందబ్బా?.. సెర్చ్ చేస్తోన్న నెటిజన్లు

by  |
ట్విట్టర్ సీఈవోకి ఎంత జీతముంటుందబ్బా?.. సెర్చ్ చేస్తోన్న నెటిజన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్విట్టర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించడాన్ని హర్షించిన ఇండియన్స్.. ఇక ఆయన గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన విషయాల కోసం గూగుల్‌లో వెతుకుతున్నారు. దీంతో పరాగ్.. గూగుల్ సర్చింజెన్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఇందులో ముఖ్యంగా ఆయన వయస్సు, ఎక్కడ చదువుకున్నాడు, ఇది వరకు ఏ కంపెనీల్లో పనిచేశారు, ఆయన జీతం ఎంత అన్న వాటిని తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తు్న్నట్లు తెలిసింది. అయితే, పరాగ్ 2005లో తన బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులను కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్ట్‌లో పూర్తి చేసి 2011లో ట్విట్టర్ కంపెనీలో చేరాడు. పదేళ్ల శ్రమకు తన 38వ ఏట అదే సంస్థకు సీఈవోగా నియమితులయ్యారు. అయితే, ఆయన ఏడాదికి 1 మిలియన్ డాలర్ల వేతనాన్ని పొందుతారని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీలో రూ.7.50 కోట్లు. అంతేకాకుండా, 12.5 మిలియన్‌ డాలర్లు విలువ చేసే రెస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్లు కూడా పరాగ్‌కు సంస్థ అందించనుంది.


Next Story