క్యారట్‌తో చర్మానికి కాంతి

by  |
క్యారట్‌తో చర్మానికి కాంతి
X

దిశ, వెబ్ డెస్క్: చర్మం ఆరోగ్యంగా ఉంటేనే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అలా ముఖం మెరువడం కోసం మహిళలు మార్కెట్‌లో రకరకాల సబ్బులు, మిశ్రమాలు వాడుతుంటారు. అయితే, అవన్నీ రసాయనాలతో తయారు చేసినవే. తద్వారా ముఖం నిగారింపు తాత్కాలికంగా ఉండటమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అందుచేత ప్రకృతిలో దొరికి సహజ సిద్ధమైన క్యారట్‌ తినడం, ఇతర చిట్కాలు పాటిస్తే చర్మకాంతి వస్తుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాఫ్ట్‌నెస్ కోసం..

పాలమీగడ, తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మంలో సాఫ్ట్‌నెస్ వస్తుంది. పాలల్లో కాస్త ఉప్పు చల్లి అందులో నిమ్మరసం వేసి ఫేస్‌కు పూయాలి. ముఖంపై ఉండే డస్ట్ పోతుంది. ద్రాక్ష పళ్లను ముఖంపై రుద్దాలి. అరగంట సేపు ఆరనిచ్చాక ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫేస్‌లో గ్లో వస్తుంది.

పొడిబారకుండా ఉండాలంటే..

బయటకు వెళ్లేటప్పుడు ఎండ వల్ల, కాలుష్యం వల్ల చర్మం పొడిబారుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో తొందరగా ముఖం నల్లబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే దోసకాయరసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి రాసుకోవాలి. కాస్త మంచి గంధం, కొంచెం పసుపు, పాలు కలిపి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. అప్పుడు ముఖంపైన చర్మం పొడిబారదు, పాడవదు.

గ్లో కోసం..

టమాటరసంతో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేస్తే ముఖంలో గ్లో వస్తుంది.

మడతల తొలగింపునకు..

క్యాబేజ్ రసంలో రెండు చుక్కల తేనే వేసి ముఖానికి పట్టిస్తే మడతలు తొలగిపోతాయి.

సహజ కాంతి మీ సొంతం..

క్యారెట్ జ్యూస్‌ను ముఖానికి పట్టించుకుంటే సహజమైన కాంతి వస్తుంది. అలోవెరా (కలబంద) జ్యూస్ రాస్తే ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి. ముల్తాన్ మట్టి, నిమ్మ ఆకుల పౌడర్, తులసి ఆకుల పౌడర్, రోజ్ వాటర్ మిశ్రమంగా కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీంతో పాటు చక్కటి సౌందర్యం వస్తుంది.

నారింజ పండ్లు తింటే ప్రయోజనాలివే..

Next Story