నదుల గమనం మారుతుందా?

by  |
rivers
X

దిశ, ఫీచర్స్: నాగరికత అభివృద్ధి మహానదుల తీరాల్లోనే జరిగిందనేది తెలిసిన విషయమే. కానీ ఆ నదులు వాటి ప్రవాహ మార్గాలను మార్చుకున్నప్పుడు, పురాతన సంస్కృతులన్నీ కూడా అంతమయ్యాయి. అయితే ఈ రోజుల్లో నదీ ప్రవాహాలు క్షీణిస్తుండగా, ఇదే పద్ధతిలో అవి తరిగిపోతూ ఉంటే మరో ఇరవై ఏళ్లల్లో వర్షాకాలపు నదులుగా మారిపోతాయని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వాటి గమనం ఎలా మారుతుందో అర్థం చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 48 రివర్ డెల్టా వ్యవస్థలను వివిధ వాతావరణ సామాజిక ఆర్థిక సందర్భాల నుంచి పరిశోధకులు పరిశీలించారు.

మిలియన్ మంది ప్రజల ఆర్థిక వ్యవస్థలను నదీ డెల్టాలు నిలబెట్టినందునా.. ఆ వ్యవస్థల్లో ఇటీవల కాలంలో వచ్చిన మార్పులను డాక్యుమెంట్ చేయడం అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ డేటా జనాభా సాంద్రతను నిర్వహించడంలో, భవిష్యత్తు నగర అభివృద్ధికి ప్రణాళిక చేయడంలో ప్రభుత్వాలకు సాయపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే నదీ డెల్టా వ్యవస్థల కదలిక, వలసలను నిర్ణయించే నాలుగు అంశాలను పరిశోధకులు గుర్తించారు.

*నదులు, అలల ప్రభావాల మధ్య పరస్పర చర్య
* ఛానల్ మోసుకెళ్లే అవక్షేపం (అకా సెడిమెంట్ ఫ్లక్స్)
* వరదల ఫ్రీక్వెన్సీ, పరిమాణం
* ఛానల్ సగటు పరిమాణం

అధిక ఆటుపోట్లు డెల్టాలో ‘లవణీయ సముద్రపు నీటి’ ఇన్‌పుట్‌ను పెంచుతాయి. సెడిమెంట్ ఫ్లక్స్‌లో పెరుగుదల డెల్టా ఛానల్‌లో అధిక మార్పులకు కారణమవుతుందని, తద్వారా అది మరింతగా వలసపోయేలా చేస్తుందని పరిశోధకులు ఊహిస్తున్నారు. డెల్టా ముఖద్వారం వద్ద అవక్షేపం డిశ్చార్జ్ చేసినప్పుడు సహజంగా నీటి గమనం మారుతుంది కాబట్టిఛానల్‌ మైగ్రేషన్‌కు అవక్షేప ప్రవాహం కీలకమైన డ్రైవర్‌గా చెప్పొచ్చు. ఫ్లడ్ ఫోర్సింగ్, హై ఫ్లడ్ ఫ్రీక్వెన్సీ, సెడిమెంట్ ఫ్లక్స్ వంటివి అధికంగా సంభవించినప్పుడు చానల్ మైగ్రేషన్ అధికంగా ఉంటుంది. కాగా భారత్‌లోని గోదావరి, చైనాలోని యాంగ్జీ డెల్టాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.

Next Story

Most Viewed