2023 పంచాంగం : కన్యా రాశి వారు కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు

by Dishanational2 |
2023 పంచాంగం : కన్యా రాశి వారు కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు
X

కన్యారాశి

సౌర గోచారము: కన్యా మాసములో పుట్టిన వారికి

చంద్ర గోచారము: ఉత్తరఫల్గుని 2, 3, 4, హస్త, చిత్ర 1, 2

నామ నక్షత్రము: టో, పా, పి, పూ, షం, ణ, ఢ, సీ. పో

ఆదాయ వ్యయాలు

ఆదాయం 2

వ్యయం 11

రాజపూజ్యం 4

అవమానం 7

గురువు : ఏప్రిల్ 22 వరకు 7న లోహమూర్తి. కుటుంబమున సౌఖ్యము తగ్గును. అనారోగ్యములు, అపకీర్తి పెరుగును. తదాది వత్సరపర్యన్తం 8న లోహ మూర్తి. విఘ్నములెక్కువ, కుటుంబ, బంధు చికాకులు ఎక్కువగును.

రాహువు : అక్టోబరు 30 వరకు8న లోహమూర్తి. విఘ్నములు ఎక్కువ. ఆరోగ్యం తక్కువ. తదాది వత్సరపర్యస్తం 7 రజతమూర్తి. శ్రమకు తగిన ఫలితములు కలుగును.

కేతువు : అక్టోబరు 30 వరకు 2న లోహమూర్తి. శ్రమకు తగిన సుఖము కలుగును.

ఈ ఏడాది ఆరవ స్థానంలో శని, 8వ స్థానంలో గురు రాహువులు, రెండవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా ప్రతికూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. పని భారం పెరిగి శ్రమ అధికం అవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు, దుబారా పెరుగుతాయి. మంచి విజయాలు, సాఫల్యాలను మీ ఖాతాలో వేసుకుంటారు. అనుకున్నవి సాధిస్తారు.ఆర్థిక సమస్యలు పరిష్కారం కావటానికి ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. పిల్లలు బాగా ఒత్తిడికి గురవటం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం ఎక్కువగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.వివాహాది శుభ కార్యములు స్థిరపడతాయి, నూతన వ్యక్తుల పరిచయం ఎంతో సంతృప్తి నిస్తుంది. విద్యార్థులకు కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు బడలీలు కోరకుండుట మేలు. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుస్తుంది. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు బిల్లుల వసూళ్ళు ఆలస్యమగు సూచనలు కలవు. ఫైనాన్స్ నాయకుల వ్యాపారులు ఆచితూచి వ్యవహరించవలెను. వివాహాది శుభకార్యములకు అడ్డుతగిలే వారు ఎక్కువగుదురు. కుటుంబంలో అశాంతి పెరుగును. ధన వ్యయము ఎక్కువ అవుతుంది, అధికారంలో ఉన్నవారికి నోటి దురుసుతనం వలన ఇబ్బందులు వచ్చును. అన్ని రంగములందు పనులు స్తంభిస్తాయి.

కోర్టు వ్యవహారాదులు అనుకూలంగా ఉండవు. వ్యాపారస్థులకు వ్యయము ఎక్కువగును. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విదేశాల్లో ఉద్యోగం, విదేశీ చదువులు, సంతానం అభివృద్ది, ఆదాయం పెరుగుదల, ఆధ్యాత్మిక చింతన వంటివి అనుభవానికి వస్తాయి. జాతక చక్రం అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ ఏడాది బాగా గడిచిపోతుందనే చెప్పవచ్చు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగ౦ లభిస్తుంది. పిల్లలకు పెల్లి సంబంధాలు కుదురుతాయి. భార్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరత్రా, అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వీసా సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారమవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విదేశీ పర్యటన సూచనలున్నాయి. విద్యార్థులకు అనుకూల౦గా ఉంది. స్నేహితురాలితో ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. లాయర్దు, బ్యాంకర్లు, అర్థిక నిపుణులు, కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. కన్యారాశి కెరీర్ జాతకం ప్రకారం, ఈ సంవస్త్రం కన్యారాశి స్థానికులు సంవస్త్రం ప్రారంభంలో వారి వృత్తికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించాలి.జనవరి నెలలో మీరు మీ కెరీర్ లో బదీలిని పొందవొచ్చు.ఈ సంవస్త్రం మీ కెరీర్ మీకు ముందుకు సాగడానికి చాలా అవకాశాలను ఇస్తుంది, అయితే ఏప్రిల్ 22న జరిగే 8వ ఇంట్లో బృహస్పతి -రాహువు కలయిక కారణంగా చాలా సందర్భాలలో మీ సమయం గందరగోళానికి గురవుతుందని మీరు గుర్తించుకోవాలి.మీ పని రంగంలో కూడా ఆకస్మిక మార్పు ఉండవొచ్చు లేదా మీరు వ్యాపారం చేస్తే, ఏప్రిల్ తర్వాత వ్యాపారాన్ని మార్చే అవకాశాలు కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండిNext Story