ఉగాది పంచాంగం : కన్యారాశి వారికి వైవాహిక బంధంలో ఇబ్బందులు తప్పవు!

by Disha Web Desk 8 |
ఉగాది పంచాంగం : కన్యారాశి వారికి వైవాహిక బంధంలో ఇబ్బందులు తప్పవు!
X

దిశ, ఫీచర్స్ : శ్రీ క్రోధినామ సంవత్సరం వచ్చేస్తుంది. ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారి ఆదాయ వ్యయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2

ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. డబ్బుల విషయంలో చాలా ఇబ్బందులు పడతారు. సమయానికి డబ్బు చేతికందదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. భార్య భర్తల మధ్య కలహాలు ఎక్కువ అవుతాయి.

ఉద్యోగులకు కూడా గడ్డుకాలమే. ప్రమోషన్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కష్టానికి తగిన ఫలితం లభించదు. ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి వ్యాపారస్తులకు నష్టాలు తప్పవు. ముఖ్యంగా బంగారం, వెండి వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయనాయకులకు కలిసి వస్తుంది. పోటీలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇక ఈ రాశి నాయకులకు గురు బలం వలన కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక బాధలు ఎక్కువ అవుతాయి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చు.


Next Story

Most Viewed