ఉగాది పంచాంగం: ఈ రాశి వారికి నరఘోష చాలా ఎక్కువ!

by Disha Web Desk 8 |
ఉగాది పంచాంగం: ఈ రాశి వారికి నరఘోష చాలా ఎక్కువ!
X

దిశ, ఫీచర్స్ : ఉగాది వచ్చేస్తుంది. ఏప్రిల్ 9న తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇక ఉగాది రోజు అందరూ తమకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని పంచాంగం తెలుసుకుంటారు. కాగా క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది. ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుందాం.

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5

ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉండనున్నాయి. క్రోధినామ సంవత్సరం వీరికి కలిసి వస్తుంది. గురుడు ఆరో స్థానంలో, రాహుకేతువులు నాలుగు, పది, శని కూడా శుభ స్థానంలో ఉండటం వలన వీరు ఈ సంవత్సరం ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అలాగే కొన్ని సమస్యలు ఏర్పడుతాయి కానీ మీ మనో ధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు.

వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి ఫలితాలు పొందుతారు. కానీ స్టీల్ వ్యాపారం చేసేవారు మాత్రం కాస్త ఇబ్బందులకు గురి అవుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలను పొందుతారు. కోరుకున్న కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడుతారు. ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. భార్య భర్తల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. సినీరంగాలకు వారికి బాగుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. కానీ ఈ రాశి వారిపై ఎక్కవ నరఘోష ఉండటం వలన చికాకులు, కుటుంబంలో మనశ్శాంతి కరువు అవడం లాంటిది జరుగుతుంది.


Next Story

Most Viewed