ఉగాది పంచాంగం : ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉన్నదంటే?

by Disha Web Desk 8 |
ఉగాది పంచాంగం : ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉన్నదంటే?
X

దిశ, ఫీచర్స్ : మకర రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది. వీరి ఆదాయ వ్యయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1

మకర రాశి వారికి ఈ సంవత్సరం సానుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది ఏలినాటి శని ఉంది అలాగే రాహుకేతులు శుభ స్థానంలో, కుజుడు అర్థాష్టమంలో ఉన్నారు. ఈ గ్రహ సంచారం ప్రభావంతో ఏ పని చేసినా బ్యాలెన్స్ గా చేస్తారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కూడా సానుకూలంగా ఉండనుంది. కానీ మొదటి ఆరు నెలలు వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఉద్యోగం పోయే అవకాశం లేకపోలేదు. కానీ తర్వాత ఆరు నెలలు మాత్రం చాలా బాగుంది. ఇక వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. మంచి ఆదాయం కూడా పొందుతారు. కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి.

మకర రాశి విద్యార్థులకు కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఇక రాజకీయ నాయకులకు శని బలం వలన మంచి ఫలితాలు పొందుతారు. వీరికి అన్నింట కలిసి వస్తుంది. ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తి చేస్తారు. చాలా సంతోషంగా గడుపుతారు. కానీ ఖర్చులు అధికం అవడం కాస్త ఆందోళనకు గురి చేస్తుంది.


Next Story

Most Viewed