ఆషాఢమాసంలో రెండు అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం

by Prasanna |
ఆషాఢమాసంలో రెండు అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం
X

దిశ, ఫీచర్స్: తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆషాడ మాసం జూలై 5న ప్రారంభమయింది. ఈ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఈ నెలలోనే కొన్ని గ్రహాలు సంచారం చేస్తాయి. అలాగే నక్షత్రాల్లోకి కూడా గ్రహాలు కూడా ప్రవేశిస్తాయి. ఇదిలా ఉండగా ఆషాడ అమావాస్య రోజున మిథున రాశిలో రెండు గ్రహాలు సంయోగం చేయనున్నాయి. ఈ కారణంగా ధ్రువ యోగం, సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. దీని ప్రభావం ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉండనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. మీ శ్రమకు ఫలితం లభిస్తుంది. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగల అద్భుతమైన సామర్థ్యం వీరికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా వారికి మంచి లాభాలు రావడమే కాకుండా పెట్టుబడులు పెడతారు. మీ వైవాహిక జీవితం అద్భుతంగ ఉంటుంది. మీ ప్రియమైన వారిని కలుసుకుని మీ మనసులో మాట చెబుతారు. అంతే కాకుండా, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు వృత్తిపరంగా కూడా సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ ఈ సమయంలో వాటి నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. మీరు కొనుగోలు చేసిన భూమి రేట్లు పెరుగుతాయి. దీని వలన మీ కుటుంబం సభ్యులు సంతోష పడతారు. పెట్టుబడులు పెట్టిన వారు అధిక లాభాలను పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.Next Story

Most Viewed