నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం

by Dishanational2 |
నేటి రాశిఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం
X

మేష రాశి : భవిష్యత్తు అవసరాలకోసం పెట్టిన పెట్టుబడుల ద్వారా నేడు మంచి ఫలితాలు అందుతాయి. ఈ రాశివారు ఈ రోజు మొత్తం చాలా సరదాగా గడుపుతారు. మీ కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. మీరు చేసే కొన్ని పనుల వలన మీ ఆఫీసులోని ఉన్నతాధికారులు ఆగ్రహానికి గురి అవుతారు. నేడు మీ ఖాళీ సమయాన్ని కూడా ఆఫీసు పనులకై ఉపయోగిస్తారు.

వృషభ రాశి : ఆస్తి వ్యవహారాలు ఓ కొల్కి వస్తాయి. మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపడానికి ఆసక్తి చూపుతారు. ఈరోజు మీ మనసులో ఉన్న కొన్ని వ్యవహారాలు మిమ్ముల్ని ఆందోళనకు గురి చేస్తాయి. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మిథున రాశి : ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. కుటుంబంలోని సమస్యలు కాస్త ఒత్తిడికి గురి చేస్తాయి. దీనివలన మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుణప్రయత్నాలు లాభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటక రాశి : ఈ రోజు ఈరాశి వారి ఓ శుభవార్త అందే అవకాశం ఉంది. కొన్ని గొడవలు జరగడం వలన మీ మూడ్ మొత్తం చేంజ్ అవుతుంది. అనుకోకుండా అందే శుభవార్త వలన మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంలో మునిగిపోతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. నేడు మీ స్నేహితులు మీకు ఆర్థికంగా సపోర్టు చేస్తారు.

సింహ రాశి : శ్రమతో కూడిన రోజుతప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. ఆఫీసులో ముఖ్యమైన పనులన్నీ త్వరగా కంప్లీట్ చేస్తారు. ఈరోజు సమాజ సేవ మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీ స్నేహితులతో మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటారు. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.

కన్యా రాశి : ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇబ్బందుల్లో ఉన్న స్నేహితులని ఆదుకుంటారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధు వర్గంలో మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రమ మీద కొన్ని వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళతారు.

తుల రాశి : ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇతరుల మీద ఆధారపడకుండా కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. ఆదాయానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు చేసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చిక రాశి : ఈరోజు మీరు ఆగ్రహానికి లోను కాకుండా చూసుకోండి. ఒత్తిడి, అసలసట, ఆందోళనలు మీరు డిప్రెషన్‌కు గురి అయ్యేలా చేస్తారు. చర్మ సంబంధ వ్యాధులు అధికం అవుతాయి. ఎప్పటి నుంచో చేస్తన్న పొదుపు మిమ్ముల్ని ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతుంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

ధనస్సు రాశి :ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును. ఏవైనా దీర్ఘకాలికవ్యాధులు మిములను ఈరోజు భాదిస్తాయి,కావున మీరు నేడు ఆసుపత్రికి వెళ్లి అధికంగా ఖర్చుచేయవలసి ఉంటుంది. కొత్త వ్యక్తులతో బిజినెస్ చేసే క్రమంలో ఒకసారి ఆలోచించండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కలసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మకర రాశి : పాత పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవరసం. గతలం లో పెట్టిన పెడ్డుబడులు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది.

కుంభ రాశి : ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్తితులు చక్కబడుతాయి. అవసరానికి డబ్బు చేతికదడం వలన ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా కాలంగా చెల్లించని బకాయిలు చెల్లిస్తారు. ఆఫీసులో మీ భాగస్వాములు మిమ్ముల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు కలిసి వస్తుంది.

మీన రాశి : ఉద్యోగరీత్యా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అవసరమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Telugu Panchangam 19 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే !


Next Story

Most Viewed