నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి నేడు అనుకోని అద్భుత ఫలితాలు

by Dishanational2 |
నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి నేడు అనుకోని అద్భుత ఫలితాలు
X

మేష రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా బాగుంటుంది. మీ తోబుట్టువుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు అందుకుటారు. మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురి అవుతారు. మీ చుట్టూ ఉన్న వారిపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి : కొత్త వెంచర్లకు కలిసి వస్తుంది.వ్యాపారంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది. రుణసాదుపాయం కలుగుతుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ నెరవేరుతాయి. దగ్గరి వారితో వాగ్వివాదానికి వెల్లడం మిమ్ముల్ని సమస్యల్లో నెట్టేస్తుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది.

మిథున రాశి : ఓటమి ఈరోజు మీవెనుకనే ఉంటుంది, కనుక వాటినుండి పాఠాలు నేర్చుకొవాలి. 'సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. ఈరోజు వ్యాపారస్తులు వారిసమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబసభ్యులతో గడుపుతారు.ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది.

కర్కాటక రాశి : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.మీ ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు మీకు ఇబ్బందులను తీసుకొస్తాయి. ఇతరుల సహాయం లేకుండానే కష్టమైన పనిని కూడా అవలీలగా చేసేస్తారు. ఆఫీసులో ఉత్సాహంగా పని చేస్తారు. విద్యార్ధులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారు నేడు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

సింహ రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా బాగుంటుంది.గ్రహాలు , నక్షత్రాలయొక్క స్తితిగతుల వలన ,మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి.

కన్యా రాశి : కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

తుల రాశి : ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఐటీ రంగం వారు పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో పెద్దల నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

వృశ్చిక రాశి : ఖర్చులు అధికంగా ఉంటాయి. రోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడపాలని అనుకుంటారు, కానీ ఆఫీసులో ముఖ్యమైన పని వలన అది జరగదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టు బడులు పెట్టే వారికి కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారు నేడు సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి అధికం అవుతుంది. చిల్లర వ్యాపారస్థులకు, టోకు వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మీ సన్నిహితులు నేడు మీతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్యమైన పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలంట.

మకర రాశి :మానసిక ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగంలో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలలో ముందుకు వెళతారు. ఇతరులకు సహాయం చేస్తారు. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభ రాశి :పనిచేసే చోట, సీనియర్లనుండి ఒత్తిడి, ఇంట్లో పట్టించుకోనితనం మీకు కొంతవరకు సమస్యలను తీసుకొస్తుంది. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి,ఇది మీకు కలిసివస్తుంది. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

మీన రాశి :ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. సునాయాసంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.


Next Story

Most Viewed