నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి నేడు అనుకోని లాభాలు

by Dishanational2 |
నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి నేడు అనుకోని లాభాలు
X

మేష రాశి : ఈరోజు మీరు అధికమొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. కొత్త స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో చాలా సంతోషంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలోని శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట సానకూల వాతావరణం ఏర్పడుతుంది.

వృషభ రాశి : ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఓ వార్త మీ కుటుంబాన్ని అంతటినీ సంతోషంగా ఉంచుతుంది. స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టిన వారికి కలిసి వస్తుంది. ఈరోజు మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు. స్నేహితులతో కలసి సినిమా చూడటానికి ఇష్టపడుతారు. ఆఫీసులోని కొన్ని సంఘటనలు మిమ్ముల్ని చాలా బాధిస్తాయి.

మిథున రాశి : వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల్లో ఉన్న వారికి అధిక లాభాలు వస్తాయి. మీ ఇంట్లో ముఖ్యమైన వేడుకలు చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ పిల్లలు పోటి పరీక్షల్లో విజయం సాధిస్తారు.విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.

కర్కాటక రాశి : ఆర్థికంగా బాగుంటుంది. డబ్బును ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఈ రాశి వారు నేడు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు హాజరుకాబోయే వేడుకల్లో కొత్త పరిచయాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. మీ ఖాళీ సమయాన్ని ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.

సింహ రాశి : ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నేడు మీ ఇంటికి మీ బంధువులు రావడం కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చాలా కాలం నుంచి వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి. ఈ రాశివారు దూర ప్రయాణాలు చేయావలసి వస్తుంది. కానీ ప్రయాణల్లో కలిసి రావడం సంతోషాన్ని ఇస్తుంది.

కన్యా రాశి : స్థిరాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరమవుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకిస్మక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. వివాహది శుభకార్యాలకు మంచి సమయం.

తుల రాశి : అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలున్నాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి :మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటి వాటిని వదిలివేయాలి. మీరు పెట్టిన పాత పెట్టుబడులు మీకు రాబడిని ఇష్తాయి. ఈరోజు ఆఫీసులో మీ పనులను ఆటం కలిగించడానికి కొందరు ఎదురు చూస్తారు. కుటుంబంలోని సమ్యలు ఇబ్బందికరంగా ఉంటాయి.

ధనస్సు రాశి : ఈరోజు మొత్తం మీరు చాలా శ్రమపడుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీకు తెలియని వారి సలహాల వలన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపకండి. అది మీకు సమస్యలు తీసుకస్తుంది. స్నేహితులతో, బిజినెస్ అసోసియేట్లతో వ్యాపారం చేసినట్లైతే మీ స్వలాభం కూడా చూసుకోవడం మంచిది. పాతకాలం సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయి.

మకర రాశి : కుటుంబంలోని సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఆఫీసులో వర్క్ పెండింగ్‌లో ఉంటుంది. మీరు ఎదురు చూడకుండానే మీ వ్యాపారంలోని లాభాలు వచ్చి చేరుతాయి. దీంతో ఆర్థికసమస్యలన్నీ తీరి పోతాయి. ఇంటా బయట సానుకూలమైన ఫలితాలుంటాయి. రోజు మొత్తం చాలా కష్టపడుతారు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాదు,

కుంభ రాశి : ఈరోజు మీకు ఆర్థికప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి,కానీ మీయొక్క దూకుడు స్వభావముచేత మీరు అనుకున్నంత ప్రయోజనం పొందలేరు. మీ సంతానం కోసం ఇప్పటి నుంచే ఆలోచించి, అనారోగ్య సమస్యల భారిన పడే అవకాశం ఉంది. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

మీన రాశి : రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.


Next Story

Most Viewed