నేటి రాశిఫలాలు : ఈరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజు

by Dishanational2 |
నేటి రాశిఫలాలు : ఈరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజు
X

మేషరాశి : శ్రమతో కూడిన రోజుతప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్‌ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చును. మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది మీ ఇంట్లో సంతోషానికి కారణం అవుతుంది. సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి.

వృషభ రాశి : ఈ రాశివారు ఈరోజు చాలా సరదగా గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీని ఫలితంగా మీకు ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరాశి ఉద్యోగులకు ఈరోజు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

మిథను రాశి : ఈరాశి ఉద్యోగులు ఈరోజు ఆఫీసులల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సీనియర్ల నుంచి ఒత్తిడి చికాకును కలిగిస్తుంది. ఈరోజు మీరు అధికంగా ఖర్చు చేయడం వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు. దూర ప్రాతం నుంచే వార్త మీ కుటుంబాన్ని అంతటినీ ఆనందంగా ఉంచుతుంది.


కర్కాటక రాశి : మీకు మానసిక అనారోగ్యం కలిగించేలోపల మీ వ్యతిరేకతా ఆలోచనలను వదిలించికోవాలి. దానికోసం మీరు దానధర్మాలు, సంఘసేవలు చేస్తే, పూర్తిగా అవి తొలగిపోయి, మనశ్శాంతి కలుగుతుంది. వృత్తివ్యాపారాల్లో మీతండ్రిగారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీరుఅనుకున్నట్టు కుటుంబపరిస్థితి ఉండదు.ఈరోజు ఇంట్లో కలహాలు,గొడవలు ఏర్పడతాయి,ఈసమయంలో మిమ్ములను మీరు నియంత్రించుకోండి. మీ మాటను అదుపుచేయడానికి ప్రయత్నించండి.

సింహ రాశి : మీ బాధలను ఇతరులతో పంచుకోండి ఇది మీకున్న అనారోగ్య సమస్యల నుంచి బయట పడేలా చేస్తుంది. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్నిఆర్థికనష్టాలను ఎదురుకుంటారు. ఇది మీ రోజుమొతాన్ని దెబ్బతీస్తుంది. ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది. రోజూచివర్లో మీరు మీకుటుంబానికి సమయముకేటాయించాలి అనిచూస్తారు,కానీ మీరుమీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటమువలన మీయొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది.

కన్యా రాశి : పనిచేసే చోట, సీనియర్ల నుండి ఒత్తిడి, కుటుంబంలోని కలహాలు చికాకును కలిగిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు కొన్ని క్లిష్ట సమయాల్లో మీ సోదరుల సహాయం అందుతుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ చురుకుదనం అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా సంతోషంగా గడుపుతారు.

తుల రాశి : ఈరోజు మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అను కోని అతిథి రావడం చాలా సంతోషాన్ని స్తుంది. విద్యార్థులకు ఈరోజు కలిసి వచ్చే రోజు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు అధిక లాభాలు పొందుతారు. ఈరాశి వారు నేడు విందు, వినోదాల్లో పాల్గొంటారు. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : ఈరోజు మీకు మీ భాగస్వామికి మధ్య వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. మీ స్నేహితునితో అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితి తీసుకొస్తుంది. అనేక సమస్యలు చుట్టుముట్టినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈరోజు మీరు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలుజరిగి, మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. స్నేహితులు, దగ్గరివారు, మీకు తమ సహాయ హస్తాన్ని అందిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈరాశి నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

మకర రాశి : మీ చిరునవ్వే ఈరోజు సమస్యల నుంచి మిమ్ముల్ని బయటపడేలా చేస్తుంది. ఈరాశిలోని వారు రియల్ ఎస్టేట్లో గనుక పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంది. క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి, మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. ఈరోజు మీరు మీఇంటిని చక్కదిద్దటానికి,శుభ్రపరుచుటకు ప్రణాళిక రూపొందిస్తారు,కానీ మీకు ఈరోజు ఖాళీసమయము దొరకదు. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.

కుంభ రాశి : ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫునవారినుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్ధికసహాయము చేస్తారు. మీరు అనుకున్నట్టు కుటుంబపరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో కలహాలు, గొడవలు ఏర్పడతాయి. ఈసమయంలో మిమ్ములను మీరు నియంత్రించుకోండి. మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్ లకి తల ఒగ్గకండి. ఎవరైతే విదేశీట్రేడ్ రంగాల్లోఉన్నారోవారికి అనుకున్నఫలితాలు సంభవిస్తాయి.

మీన రాశి : ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. రోజు రెండో భాగంలో ఆర్థక లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు వారిపనితనాన్నిచూపిస్తారు. అనవసర పనులవలన ఈరోజు మీసమయము వృధాఅవుతుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది. కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు.


Next Story