నేటి రాశి ఫలాలు : ఈరాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం

by Disha Web |
నేటి రాశి ఫలాలు : ఈరాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం
X

మేష రాశి : ఆర్థికగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. మీ ఖాళీ సమయాన్ని ఈరోజు మీరు చాలా ఆనందంగా గడుపుతారు. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. మీరీ రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామానుగురించి జాగ్రత్త వహించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది.

వృషభ రాశి : సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం, మానసిక ఉద్వేగానికి గురిఅవుతారు. ఈ రోజు మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మిసహుద్యోగితో గడుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయము అనవసరం,వృధాఅయినట్టు భావిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

మిథున రాశి : ఈ రోజు ఈరాశి వారు విందు, వినోదాల్లో పాల్గొంటారు. చిరకాలంగా వసూలు కానీ బాకీలు వసూలవడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనల పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. మీకు బాగా ఇష్టమైన వారినుండి కాల్ రావడంతో మీకు ఎంతో ఎక్సైటింగ్ గా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు.

కర్కాటక రాశి : మానసిక భయం లేదా సైకలాజికల్ ఫియర్ మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. సానుకూల దృక్పథం, వెలుగువైపుకు చూడడం అనేవి మిమ్మల్ని సురక్షితంగా ఉంచగలవు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే, మీసన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి.ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు కలుగుతాయి. మీకువారు సరైనవారు కాదు,మీ సమయము పూర్తిగా వృధాఅవుతోంది అనిభావిస్తే మీరు అలంటి కంపెనీలను,వ్యక్తులను విడిచిపెట్టండి.

సింహ రాశి : విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. ఈరోజు మీకు మీమనస్సుకు బాగా దగ్గరైనవారికి గొడవలుజరిగే అవకాశము ఉన్నది. దీనివలన మీరు న్యాయస్థానంమెట్లుఎక్కవలసి ఉంటుంది. దీనివలన మీరుకస్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. భావోద్వేగాలు మిమ్మల్ని చీకాకు పెడతాయి.

కన్యా రాశి : ఈరోజు ఎందులోనైనా పెట్టుబడులు పెట్టే ముందు ఒక సారి ఆలోచించడం మంచిది. అనవసరంగా పెట్టారో వారికి ఆర్ధికనష్టాలు తప్పవు. మిత్రులతో గడిపే సాయంత్రాలు, లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరిత ఉత్సాహాన్ని ఇస్తాయి. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్ట డానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది.

తుల రాశి : ఈ రోజు మీకు అంత ప్రయోజనకరంగా ఉండదు. ఖర్చు పెట్టే సమయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు రెండో భాగంలో మీకు బాగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు, మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొండి. ఏ పరిస్థితులవలనకూడా మీరు సమయాన్ని వృధాచేయకండి.సమయము చాల విలువైనది అని మర్చిపోకండి.ఒకసారి పోతే మళ్లి తిరిగిరాదు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు.

వృశ్చిక రాశి : బాగా పరపతి ఉన్న వ్యక్తుల మీకు సపోర్టు ఇవ్వడం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మీ చరాస్తులు దొంగతనానికి గురికాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదాగిన సూచన. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కొన్ని కొన్ని విషయాలను సిల్లీగా తీసుకోకండి అవి మీ జీవితంలో పెద్ద సమస్యగా మారవచ్చును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ధనస్సు రాశి : ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చుపెడుతున్నవారు,డబ్బు ఎంతకష్టపడితే వస్తుందో,ఆకస్మికంగా ఏదైనా సమస్యవస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులుసపోర్టివ్ గా ఉంటారు. మీరు మీ గ్రూపులో తిరుగుతుండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది. ఈరోజు మీరు ఖాళి సమయంలో ఇప్పటివరకు పూర్తిచేయని పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు.

మకర రాశి : మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని వదలడానికి సిద్దం కాండి. అది మీకు మంచి చేస్తుంది. ఈ రాశిలో కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ఈరాశికి చెందినవారు మీ కొరకుసమయాన్ని కేటాయించుకోండి. పనిఒత్తడి మిమ్ములను మానసికఒత్తిడికి గురిచేస్తుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు.

కుంభ రాశి: అనవసర ఖర్చులుపెట్టటం తగ్గించినప్పుడే మీడబ్బు మీకు పనికివస్తుంది. ఈ రోజు మీకు ఈవిషయము బాగా అర్ధం అవుతుంది. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి. ఈ రోజు మీరు హారుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. రోజూచివర్లో మీరు మీకుటుంబానికి సమయముకేటాయించాలి అనిచూస్తారు, కానీ మీరుమీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటమువలన మీయొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది.

మీన రాశి : మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. ఎంత తీరికలేని పనులు ఉన్నపటికీ మీరుగనుక మీకొరకు సమయాన్ని కేటయించుకోగలిగితే,సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి, ఇది మీభవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed