నేటి రాశి ఫలాలు : ఈ రాశి వారు ఈరోజు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి

by Dishanational2 |
నేటి రాశి ఫలాలు :  ఈ రాశి వారు ఈరోజు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి
X

మేష రాశి : మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదురుకుంటారు.మీతండ్రిగారిని లేక తండ్రిలాంటివారిని సలహాలు,సూచనలు అడగండి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కానీ ఓ ముఖ్యమైన వార్త మిమ్ముల్ని, మీ కుంటుంబాన్ని అంతటిని సంతోషంగా ఉంచుతుంది.

వృషభ రాశి : ఈరోజు మీకు కొన్ని పరిస్థితులు తలనొప్పి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎవరైతే డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తున్నారో వారు తమ ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకపోతే సమస్యలు తప్పవు. ఈరోజు ఈ రాశి ఉద్యోగస్తులు తమ కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు మౌనమే మంచిది. ఈరోజు మీకు చాలా బాగా ఉంటుంది.

మిథున రాశి : ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారకి కలిసి వస్తుంది. ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామి మీకు అన్ని విషయాలలో సపోర్టీవ్‌గా ఉంటాడు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.

కర్కాటక రాశి : మీకు చాలా ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్య సమస్యల నుంచి బయట పడుతారు. మీకు డబ్బువిలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి.

సింహ రాశి : ఆర్థిక సంబంధమైన సమస్యలు ఈరోజు తొలగిపోతాయి,మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి వలన అలసటకు గురి అవుతారు. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ధ్యాస పెట్టడం మంచిది. ఎందుకంటే అందులో మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.

సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఓటమి ఈరోజు మీవెనుకనే ఉంటుంది, కనుక వాటినుండి పాఠాలు నేర్చుకొవాలి.

తుల రాశి : అంతులేని మీ ఆ విశ్వాసం, సులువుగా పనిజరిగే ప్రణాళిక, మీ కు ఈరోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది. ఏవైనా దీర్ఘకాలికవ్యాధులు మిమ్ముల్ని బాధించే అవకాశం ఉంది.అందువలన మీరు అధిక ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. అనుకోని శుభ వార్త మీ కుటుంబాన్ని అంతటినీ సంతోషంగా ఉంచుతుంది. మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి : చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్నవారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే, అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిముషంలో వచ్చిన మార్పులవలన జరుగుతుంది. ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు. కానీ చివరికి అంతా అందంగా పరిష్కారమవుతుంది.ఇరుగుపొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఈ రోజు ఈరాశి వారు మద్యానికి దూరంగా ఉండాలి.

ధనస్సు రాశి : మీరు ఇంటిపనులకు సంబంధించినవాటికొరకు మీరు మీజీవితభాగస్వామితో కలసి కొన్ని ఖరీదైనవస్తువులను కొంటారు.దీనిఫలితంగా మీకు ఆర్ధికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. పొరుగువారితో తగాదా మీ మూడ్ ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఈ రాశి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.ఈరాశి వారు తమ పిల్లల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

మకర రాశి : దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, మదుపు చెయ్యడం అవసరం. కుటుంబ సభ్యుల సమవేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీరుండే చోటుకి మీ పైఅధికారిని, మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది.

కుంభ రాశి : మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్ధికలాభాలను పొందగలరు ఎందుకంటే మీరుఇచిన అప్పు మీకు తిరిగివచ్చేస్తుంది. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. సీనియర్లు, సహ ఉద్యోగులు సపోర్ట్, మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అదిమీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఈరాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుపట్ల శ్రద్దచూపించటం కఠినము అవుతుంది.స్నేహితులతోకలిసి మీవిలువైన సమయాన్ని వృధాచేస్తారు. మీకీ రోజు అంత బాగుండదు. అనేక విషయాలపట్ల వివాదాలు, అనంగీకారాలు ఉండవచ్చును. ఇది మీ బాంధవ్యాన్ని బలహీనం చేస్తుంది.

మీన రాశి : ఈరాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. రియలేస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యుత్తమ ఫలితాలు అందుకుంటారు.ఈరోజు మీముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ ల గురించి అధ్యయనం చేయడం మంచిది. ఈ రాశి వారు ఈరోజు తమ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.


Next Story

Most Viewed