నేటి రాశిఫలాలు : రాఖీ కట్టే ఈ రాశి మహిళలకు అదృష్టం మామూలుగా ఉండదు

by Disha WebDesk |
నేటి రాశిఫలాలు : రాఖీ కట్టే ఈ రాశి మహిళలకు  అదృష్టం మామూలుగా ఉండదు
X

మేష రాశి : బ్యాంకు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇతరుల సలహాలు వింటూ పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

వృషభ రాశి : వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ రోజు మీ సోదరీమణులతో ఆనందంగా గడుపుతారు. దూరపు బంధువల నుంచి అనుకోని శుభవార్త మీ కుటుంబంలో సంతోషభరితమైన క్షనాలు తీసుకొస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

మిథున రాశి : మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయం. అది, శారీరక శక్తిని తగ్గించడమే కాదు, ఆయుర్దాయాన్ని కూడా హరించివేస్తుందని మీరు గుర్తించాలి. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈరోజు మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటక రాశి : ఈ రోజు ఈరాశివారికి అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువలన నిగ్రహ శక్తిని కోల్పోకండి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. కొందరు మిమ్ముల్ని కావాలనే ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ప్రతి విషయంలోనూ ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

సింహ రాశి : మీరు ఈ రోజు మొత్తం చాలా ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. మీరు నేడు ఎవరికీ అప్పుఇవ్వకండి, ఒకవేళ ఇవ్వవలసివస్తే ఎంతసమయములో తిరిగి చెల్లిస్తాడో రాయించుకుని ఇవ్వండి. మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహాకి అందని అన్ ప్రిడక్టబుల్ గా ఉంటుంది.. ఆఫీసులో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిష్యుం డిష్యుం కాస్తా ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు, చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చుసుకునే ఏ అవకాశాన్నీ మిస్సవకండి.

కన్యారాశి :ఈ రాశివారు ఏ ప్రయత్నం చేసినా అందులో విజయం ఈరోజు మీ సొంతం అవుతుంది. మీ తోబొట్టువులు మిమ్ములను ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే అది మీకు సమస్యలను తీసుకవస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడి అధికం అవుతుంది. ప్రతి విషయంలో సానుకూలంగా స్పందించడం ద్వారా సమస్యల నుంచి బయట పడవచ్చు.

తుల రాశి : ఈరోజు మీముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల మంచి లాభాలు తెచ్చే అవకాశం ఉంది. కానీ ప్రాజెక్ట్‌లను ఒకే చేసే సమయంలో కాస్త ఆలోచించడం మంచిది. ఈరోజు మీకు ఓ స్నేహితుడు సహాయపడుతూ, చాలా సమర్థిస్తూ ఉంటాడు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. సంతోషం నిండిన ఒక మంచిరోజు. ఈ రాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు. ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కన్పిస్తూ, తాండ విస్తూ, మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది.

వృశ్చిక రాశి :మీరు ఎన్నో రోజుల నుంచి చేస్తున్న కొన్ని పనులు నెరవేరనున్నాయి. రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూచివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. మీ కుటుంబంతో కొంత సమస్యలున్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనంచేస్తుంది. ఈ రాశికిచెందిన ట్రేడ్ రంగాల్లోవారికి , మీస్నేహితుడియొక్క తప్పుడు సలహాలవలన కొన్ని సమస్యలు ఎదురుకుంటారు, ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ధనస్సు రాశి : మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం, వైభవం అంతటినీ అనుభవించడానికి సంసిద్ధం చేసేయండి. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. శ్రీమతి, మీలో ఆటుపోటుల స్వభావం ఉన్నాకానీ, సహకారాన్ని అందిస్తూనే ఉంటారు. మీప్రేమ మరింత దృఢంగా,ఆనందమగా ఉండాలి అనుకుంటే మూడోవ్య్తక్తి మాటలను నమ్మవద్దు. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా ఆనందంగా ఉంటారు.

మకర రాశి : ఈ రోజు మీకు చాలా అద్భుతంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంట్లో కార్యక్రమాలు చేయటము వలన, మీరు అధికంగా ధనమును ఖర్చుపెట్టవలసి ఉంటుంది. ఇది మీయొక్క ఆర్ధికపరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్ల నుంచి కొంత వెసులుబాటును కల్పిస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. రాఖీ కట్టే ఈ రాశి మహిళలకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

కుంభ రాశి : మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలెయ్యాలి. ఎందుకంటే, గ్రహ చలనాల రీత్యా మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులు పెట్టాలి. లేకపోతే నష్టాలు తప్పవు. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. ఆఫీసులో మీ మంచి మూడ్ కొనసాగాలంటే, మీకు మంచి మనసు ఉండాలి. .

మీన రాశి :ఈరోజు,మీయొక్క ఆరోగ్యము బాగుంటుంది.అందువలన మీరు మీస్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. తెలివిగా మదుపు చెయ్యండి. మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకొండి. జీవిత విలువలైన అంకిత భావం, మనసులో ప్రేమ, కృతజ్ఞత కలిగి సూటియైన నడవడికలను నేర్చుకొండి.అది మీకి కుటుంబజీవితం మరింత అర్థవంతంగా ఉండేలాగ చేస్తుంది.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed