శనిదేవుడికి ఈ నెల ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

by Disha Web Desk 10 |
శనిదేవుడికి ఈ నెల ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
X

దిశ,ఫీచర్స్: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారాలు, తిరోగమనాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే సంచారం చేయడం, ఇతర గ్రహాలను కలవడం వల్ల విశేష యోగాలు కలుగుతాయి. ప్రత్యేకించి శని వంటి శక్తివంతమైన గ్రహాలు సంచారం, తిరోగమనంలో ఉన్నప్పుడు, ఈ ప్రభావం అన్ని 12 రాశుల వారిపైన పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ కారణంగా, ఈ రాశుల వారికి మంచిగా ఉండనుంది. అయితే ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

తులా రాశి

కుంభ రాశిలో శని గ్రహం అస్తమించడం వల్ల ఈ రాశి వారికి లాభాలు కలుగుతాయి. అంతే కాకుండా,రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు కార్లు, ఇతర ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. అదనంగా, పూర్వీకులు నుంచి పూర్వీకులు ఆస్తులు కూడా పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారు ఊహించని లాభాలను పొందుతారు. ఇన్నేళ్లు మీరు కష్టానికి ప్రతిఫలం పొందుతారు.

మిథున రాశి

మిథునరాశి వారికి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఏ పని అయినా సమస్యలు లేకుండా పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులకు మంచిగా ఉండనుంది. మీ ముందు ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. ఇది వైవాహిక జీవితంపై కూడా చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో లాభాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed