ఇండియా నుండి రాకపోకలపై హాంకాంగ్ నిషేధం..

by  |
ఇండియా నుండి రాకపోకలపై హాంకాంగ్ నిషేధం..
X

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు తీవ్రతరం అవుతుండటంతో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఏప్రిల్ 20 నుంచి రాకపోకలు సాగించే విమానాలపై నిషేధం విధిస్తున్నట్టు ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తేలింది. ఈనెల 4న ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్లిన ‘విస్తారా’ ఫ్లైట్‌లో 47 మంది ప్రయాణికులు కరోనా బారిన పడటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటు పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి రాకపోకలు సాగించే విమానాలనూ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, హాంకాంగ్ విధించిన ఈ నిషేధం ఈనెల 20 నుంచి అమల్లోకి రానుండగా.. మే 2 దాకా (14 రోజుల దాకా) కొనసాగనున్నది. విస్తారా ఫ్లైట్ లో వచ్చినవారందరికీ క్వారంటైన్ లో ఉంచామని.. ఆయా దేశాల్లో కరోనా ముప్పు అధికంగా ఉన్నందున నిపుణులు సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హాంకాంగ్ వెల్లడించింది.

Next Story

Most Viewed