హోండా కార్స్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం..

by  |
హోండా కార్స్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తమ అన్ని మోడళ్లపై వచ్చే నెల నుంచి ధరలను పెంచాలని భావిస్తోంది. ఇటీవల ఉక్కు, ఇతర విలువైన ఉక్కు పరికరాల వంటి నిత్యావసరాల వస్తువుల వ్యయం పెరిగిపోవడంతో వాహన ధరలను పెంచక తప్పట్లేదని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ‘స్టీల్, అల్యూమినియం, ఇంకా ఇతర ముడి పరికరాల ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. వీటిలో కొన్ని పరికరాలు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి.

దీనివల్ల కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయని’ హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్, మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ అన్నారు. ఆగష్టు నెల నుంచి ధరల పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాదిలో కంపెనీ ధరల పెంపును ప్రకటించడం ఇది మూడో సారి కావడం గమనార్హం. ఏప్రిల్‌లోనూ హోండా సంస్థ వాహనాల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హోండా కంపెనీ మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలపై సగటున 1.6 శాతం పెంచింది. అంతకుముందు జనవరిలో హోండా ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ. 34 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది.



Next Story