హాకీ శిబిరం మరింత ఆలస్యం?

by  |
హాకీ శిబిరం మరింత ఆలస్యం?
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి భయాందోళనల నేపథ్యంలో టీం ఇండియా హాకీ శిబిరం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. స్ట్రైకర్ మన్‌దీప్ సింగ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సోమవారం ప్రకటించింది. ఇప్పటికే కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సహా ఐదుగురు హాకీ ఆటగాళ్లు గతవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో జట్టులో కరోనా బారినపడిన వాళ్ల సంఖ్య ఆరుకు చేరింది. త్వరలోనే బెంగళూరులో జాతీయ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని గతంలో భావించారు. కానీ ఇప్పుడు ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

‘హాకీ శిబిరాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడమే మంచిది. ఆస్ట్రేలియా వంటి జట్లు కూడా టోర్నమెంట్లకు 10-15 రోజుల ముందే శిబిరాలు ఏర్పాటు చేస్తాయి. ప్రస్తుతం ఎలాంటి టోర్నీలూ లేనప్పుడు తొందరపడి శిబిరం ఏర్పాటు చేయడం వృథానే’ అని టీం ఇండియా మాజీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్ అభిప్రాయపడ్డారు.

Next Story