ఒంటెకు ముద్దులు పెడుతున్న నటి.. ఫొటోలు వైరల్

by Admin |   ( Updated:2022-02-17 13:34:23.0  )

దిశ, సినిమా : టాలెంటెడ్ యాక్ట్రెస్ హీనా ఖాన్ ట్రావెల్ డైరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టైమ్ దొరికినప్పుడు కచ్చితంగా వెకేషన్ ప్లాన్ చేసే బ్యూటీ.. ప్రజెంట్ ఈజిప్ట్‌లో ఎంజాయ్ చేస్తోంది. గిజా పిరమిడ్ సందర్శనకు వెళ్లిన ఆమె.. అక్కడి అందాలను ఫొటోల్లో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ముఖ్యంగా ఒంటెకు ముద్దులిస్తున్నట్లున్న క్యూట్ ఫొటోలపై క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి. అక్కడి పిరమిడ్‌కు కూడా కిస్ చేస్తున్న ఫొటోలు పంచుకున్న భామ.. 'పర్ఫెక్ట్ వెదర్, పర్ఫెక్ట్ లొకేషన్, పర్ఫెక్ట్ కంపెనీయన్.. అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. పిరమిడ్స్ గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తున్నాయి' అని తన అనుభవాలను పంచుకుంది.



Next Story