భద్రంగానే శ్రీశైలం డ్యాం : అధికారులు

50

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌ భద్రంగానే ఉందని, ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదని అధికారులు తెలిపారు. డ్యాంనకు చెందిన ప్లంజిపూల్ ప్రస్తుతం దెబ్బతినడంతో స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

వెంటనే దానికి మరమ్మత్తులు చేయాలని వాళ్లు కోరగా.. అత్యవసరంగా చేయాల్సిన అవసరం లేదని డ్యాం అధికారులు వెల్లడించారు. ప్లంజిపూల్ అనేది ప్రతి రిజర్వాయర్‌కు ఉంటుందని.. శ్రీశైలం డ్యాం భద్రతపై పూర్తి అవగాహనతోనే చెప్తున్నామని అధికారులు మరోసారి స్పష్టంచేశారు.