హైకోర్టులో ఏపీ సర్కార్‎కు చుక్కెదురు

by  |
హైకోర్టులో ఏపీ సర్కార్‎కు చుక్కెదురు
X

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్ర హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు అయింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల నిర్వహాణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను ఈసీ ఉల్లంఘించిందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహారిస్తుందని ఆరోపించారు.

ప్రభుత్వ న్యాయవాది ఆరోపణలను ఈసీ తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ తిప్పికొట్టారు. మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని స్పష్టం చేశారు. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘిస్తే, సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు బయటపడతాయనే సుప్రీంను ఆశ్రయించకుండా హైకోర్టును ఆశ్రయించారని అశ్విన్ కుమార్ వాదించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి కేసు రేపటికి వాయిదా వేసింది.



Next Story

Most Viewed