ఎల్‌జీ పాలిమర్స్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు!

by  |
ఎల్‌జీ పాలిమర్స్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు!
X

దిశ, అమరావతి : ఎల్‌జీ పాలిమర్స్ స్టైరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కంపెనీ డైరెక్టర్లు తమ పాస్‌పోర్ట్‌లను స్వాధీనపరచాలని, కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని, కంపెనీలోకి ఎవరినీ అనుమతించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణకు సంబంధించిన తీర్పు కాపీని కోర్టు ఆదివారం విడుదల చేసింది. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెల్లకూడదని తీర్పు ఇచ్చింది. లాక్‌డౌన్ తర్వాత కంపెనీ కార్యకలాపాలు ఎవరి అనుమతితో తిరిగి ప్రారంభించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ దుర్ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీలు తప్పించి ఎవరూ ఎల్‌జీ పాలిమర్స్ పరిసరాల్లోకి అనుమతి లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన అనంతరం స్టైరిన్ గ్యాస్‌ను తరలించడానికి ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని, పూర్తి సమాచారం ఉన్న అఫిడవిట్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.



Next Story

Most Viewed