గాంధీలో కరోనా టెస్టులు చేయాలి: హైకోర్టు

by  |
గాంధీలో కరోనా టెస్టులు చేయాలి: హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్స్: రాష్ట్రంలో కరోనా టెస్టులు, చికిత్సలపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు గాంధీ ఆస్పత్రిలో టెస్టులు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. గాంధీ ఆస్పత్రిలో కూడా టెస్టులు జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేట్ ఆస్పత్రులను నియంత్రించాలని, రూ.4లక్షలకు పైగా బిల్లులు వసూలు చేసిన యశోద, కిమ్స్ ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. అటు ప్రైవేట్ కేంద్రాల్లో కూడా అన్నిరకాల పరీక్షలకు గరిష్ట చార్జీలు ఖరారు చేయాలని స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపింది. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారా అని ప్రశ్నించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో ఈనెల 27లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించించింది.

Next Story

Most Viewed