సోలార్ విద్యుత్ కొనుగోలుపై 10మందికి హైకోర్టు నోటీసులు

by  |
Solar Power
X

దిశ, ఏపీ బ్యూరో : సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోలార్ పవర్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆరోణలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్కెట్‌లో యూనిట్ రూ.2.05గా ఉన్న సోలార్ విద్యుత్‌ను రూ.2.45 చొప్పున కొనుగోలు చేస్తుండటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సెకీ ద్వారా ఏపీకి విద్యుత్ సరఫరాకు అదానీ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. ఈ కేసుపై ఇరువాదనలు విన్న ధర్మాసనం కేంద్రం, అదానీ గ్రూప్ సోలార్ పవర్ కార్పొరేషన్, రాష్ట్ర ఇంధన శాఖతోపాటు 10 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Next Story

Most Viewed