అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ‘ఫైర్’

by  |

హైదరాబాద్ నడిబొడ్డునున్న హుస్సెన్ సాగర్ పరిధిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త లుబ్నాసార్వత్ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రజాప్రయోజనాల వ్యాజ్యంగా సార్వత్ లేఖను స్వీకరించింది. హుస్సెన్ సాగర్ ఎల్ఎఫ్‌టీ పరిధిలో ప్లాట్లు చేస్తున్నారని, వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని లుబ్నాలేఖలో పేర్కొన్నారు.అయితే ఈ కేసును వాదించేందుకు హైకోర్టు సీనియర్ న్యాయవాది రవిచంద్రను అమికస్ క్యూరీగా కోర్టు నియమించింది. వాదనలు విన్నన్యాయస్థానం తెలంగాణ సీఎస్,పురపాలక ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పీసీబీ, జలమండలికి నోటిసులు జారీచేసింది. దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 1వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

Next Story