మంత్రి గంగుల కమలాకర్‌కు షాకిచ్చిన హైకోర్టు

by  |
మంత్రి గంగుల కమలాకర్‌కు షాకిచ్చిన హైకోర్టు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు పలువురు అధికారులకు హై కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ ఆరో డివిజన్ కార్పొరేటర్ కోల మాలతి కులధ్రువీకరణ వివాదంపై ప్రత్యర్థులు హై కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కరీంనగర్ జిల్లా కలెక్టర్, కరీంనగర్ తహసీల్దార్, కార్పొరేటర్ కోల మాలతి, బీసీ వెల్ఫేర్ మంత్రి గంగుల కమలాకర్‌లకు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కార్పొరేటర్ కోలమాలతి తప్పుడు బీసీ సర్టిఫికెట్ పొందినట్లు అప్పటి కలెక్టర్ శశాంక ఇచ్చిన ఆదేశాలపై గెజిట్ రాకముందే బీసీ మంత్రిత్వశాఖ స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై అక్టోబర్ 4 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed