సీక్రెట్ కెమెరాలున్నాయని భయపడుతున్నారా..? ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి

by  |
సీక్రెట్ కెమెరాలున్నాయని భయపడుతున్నారా..? ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని వన్ డ్రైవ్ హోటల్ లో మహిళల బాత్రూమ్ లో మొబైల్ కెమెరా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, దీనిలో దాదాపు 4 గంటల పాటు వీడియో రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆ హోటల్ కి వచ్చిన మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలా జరగడం కొత్తేమీ కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటివి చూస్తుంటే మహిళల భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

షాపింగ్ మాల్, హోటల్స్, డ్రెస్సింగ్ రూమ్స్, ట్రయల్ రూమ్స్ కి వెళ్లాలంటే మహిళలు భయపడాల్సివస్తోంది. నిర్వాహకులు చిన్న చిన్న కెమెరాలను కనిపించకుండా దాచేయడంతో వాటిని కనిపెట్టడం కష్టతరంగా మారింది. ఇలాంటి వారికోసమే కొన్ని యాప్స్ ని డిజైన్ చేశారు. ఈ యాప్ ల ద్వారా సీక్రెట్ కెమెరాలను కనిపెట్టి కొంత రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఇలాంటి యాప్ ని మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేశారా?.. అవసరం లేకున్నా ఎన్నో యాప్ లను మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుంటాం.. మరి మీ భద్రత కోసం డిజైన్ చేసిన యాప్ లను ఇన్ప్టాల్ చేసుకోండి. అందులో ఓ యాప్ ‘HIDDEN CAMERA DETECTOR’. దీనిని 50 లక్షల మంది వారి మొబైల్ లో ఇన్ట్సాల్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా మిర్రర్, హ్యాంగర్, సీలింగ్ లో పెట్టిన హిడెన్ కెమెరాలను ఇట్టే పసిగట్టేయొచ్చు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాకా.. హిడెన్ కెమెరా ఉంటే ఫోన్ లో ఒక రెడ్ అలర్ట్ కనిపిస్తుంది. దానితో పాటు డేంజర్ బెల్ మోగుతున్నట్లు ఒక బీప్ సౌండ్ వినిపిస్తుంది. దీంతో అక్కడ హిడెన్ కెమెరాలు ఉన్నట్లు వెంటనే తెలుస్తుంది.


Next Story