చై-సామ్ డివోర్స్‌పై సిద్దార్థ్ సంచలన ట్వీట్

by  |
చై-సామ్ డివోర్స్‌పై సిద్దార్థ్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: నాగచైతన్య-సమంత విడాకులను ఉద్ధేశించి పరోక్షంగా సినీ హీరో సిద్ధార్ధ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. నేను మొదటి సారిగా స్కూల్‌లో నేర్చుకున్న పాఠం ఇదే.. మరీ మీరు ఏం నేర్చుకున్నారు?’ అని ట్వీట్ చేశాడు. చై-సామ్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే సిద్ధార్థ్ ఈ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సిద్ధార్థ్ ట్వీట్ కు పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. సమంత నిన్ను మోసం చేసిందా అని సిద్ధార్థ్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే సిద్దార్థ్, సమంత ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. కొన్ని రోజులు వీరిద్దరు ప్రేమ వ్యవహారం నడపగా.. పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి.

Next Story

Most Viewed