ఆథర్ ఎనర్జీలో కొత్తగా రూ. 420 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన హీరో మోటోకార్ప్..

68
hero

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ శుక్రవారం ఆథర్ ఎనర్జీలో రూ. 420 కోట్ల వరకు కొత్త పెట్టుబడులను ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఒకటి లేదా రెండు దశల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదించిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. ఈ ప్రతిపాదిత పెట్టుబడితో ఆథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ వాటా 34.8 శాతంగా ఉంటుంది. పూర్తిస్థాయిలో పెట్టుబడుల నిధులు అందించిన తర్వాత షేర్ హోల్డింగ్‌పై స్పష్టత రానుంది. అలాగే, ఆథర్ ఎనర్జీ మూలధన సమీకరణ పూర్తయిన తర్వాత హీరో మోటోకార్ప్ ఖచ్చితమైన వాటా నిర్ణయించబడుతుంది.

హీరో మోటోకార్ప్ సంస్థ 2016లో ఆథర్ ఎనర్జీలో పెట్టుబడులను కలిగి ఉంది. ఆథర్ ఎనర్జీ కంపెనీకి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ సహా వివిధ విభాగాల్లో సహకారాన్ని అందిస్తోంది. తాజా పెట్టుబడి ప్రకటన నేపథ్యంలో మాట్లాడిన హీరో మోటోకార్ప్ ఎమర్జీంగ్ మొబిలిటీ బిజినెస్ హెడ్ స్వదేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తాము ఆథర్ ఎనర్జీలో మొదటి పెట్టుబడిదారుల్లో ఒకరిగా ఉన్నాం. ఇన్నేళ్లుగా సంస్థలో అనుబంధం కొనసాగడం సంతోషంగా ఉంది. అలాగే ఆథర్ ఎనర్జీ వృద్ధిని కూడా సానుకూలంగా ఉంది. దేశీయ ఎలక్ట్రిక్ వాహనా విభాగంలో వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.