రెండు రెట్లు పెరిగిన హీరో ఎలక్ట్రిక్ అమ్మకాలు!

by  |
రెండు రెట్లు పెరిగిన హీరో ఎలక్ట్రిక్ అమ్మకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ ఈ ఏడాది పండుగ సీజన్‌లో కంపెనీ అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయని వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15 మధ్య కాలంలో 24,000 యూనిట్ల విక్రయాలు సాధించామని, గతేడాది ఇదే కాలంలో కంపెనీ 11,339 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసినట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు అందించే ఫేమ్‌-2 పథకం కింద వాహనాలకు ఇచ్చే రాయితీ, ప్రోత్సాహకాలతో పాటు పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరిగిందని కంపెనీ పేర్కొంది.

‘2021 పండుగ సీజన్ సమయంలో ప్రధానంగా ఎక్కువ మంది వినియోగదారులకు పెట్రోల్ బైకుల కంటే ఎలక్ట్రిక్ బైకులపై ఆసక్తి పెరిగింది. దీనికితోడు ఈ-బైకులకు సంబంధించి మౌలిక సదుపాయాలు క్రమంగా అందుబాటులో వస్తుండటం అమ్మకాలకు కలిసొచ్చిందని’ హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ అన్నారు. ఈ స్థాయిలో అమ్మకాల పెరుగుదల నమోదవడం కంపెనీతో పాటు దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధికి, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహన విప్లవాన్ని కొనసాగించేందుకు వీలవుతుందని సోహిందర్ వెల్లడించారు.


Next Story

Most Viewed