కరోనా కాలర్ ట్యూన్ ఆపేయడం ఎలా?

by  |
కరోనా కాలర్ ట్యూన్ ఆపేయడం ఎలా?
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వైరస్ వ్యాప్తి భారత్‌లో మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా ‘కరోనా’ కాలర్ ట్యూన్ వినిపించడం కామన్‌గా మారింది. ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్‌ఎల్ ఇలా ఏ నెట్‌వర్క్‌కు కాల్ చేసినా.. అదే కాలర్ ట్యూన్ వినిపించేది. ఈ కాలర్ ట్యూన్‌లో అందరికీ ఉపయోగపడే కరోనా జాగ్రత్తలే చెబుతున్నా.. ఈ కారణంగా చాలా మంది వినియోగదారులు విసుగు చెందుతున్న మాట వాస్తవం. అయితే ఇప్పుడా కాలర్ ట్యూన్‌ను స్టాప్ చేయాలనుకుంటే.. సింపుల్‌గా ఇలా చేస్తే సరి. ఆండ్రాయిడ్ ఫోన్స్ వినియోగదారులైతే.. ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు కరోనా కాలర్ ట్యూన్ వినబడగానే, డయలర్‌లోని ఏదో ఒక నెంబర్ నొక్కండి. దాంతో కాలర్ ట్యూన్ ఆగిపోయి, సాధారణ రింగ్ టోన్ వినిపిస్తుంది. అదే ఐఫోన్స్ వినియోగించేవారైతే డయలర్‌లోని హ్యాష్ బటన్‌ను ప్రెస్ చేస్తే కాలర్ ట్యూన్ ఆగిపోతుంది.



Next Story

Most Viewed