విశాఖ పోర్టులోకి భారీ నౌక ప్రవేశం

by  |
విశాఖ పోర్టులోకి భారీ నౌక ప్రవేశం
X

దిశ, విశాఖపట్నం : విశాఖపట్నం పోర్ట్ ఇన్నర్ హార్బర్ లోకి తొలిసారి భారీ సరుకు రవాణా నౌక సోమవారం వచ్చింది. 229.20 మీటర్ల పొడవు, 38మీటర్ల వెడల్పు ఉన్న భారీ సరుకు రవాణా నౌక డబ్ల్యు ఓస్లో(w Oslo) నౌక విశాఖపట్నం పోర్ట్ ఇన్నర్ హార్బర్ కు మొట్టమొదటి సారి ప్రవేశించింది. కెప్టెన్ విజయ్ ప్రకాశ్, కెప్టెన్ ఆర్సీ శర్మ లు షిప్ కెప్టెన్లు గా వ్యవహరించారు. దీనిలో శారద మెటల్స్ అండ్ అల్లోయస్ కు చెందిన 27,029 మెట్రిక్ టన్నుల కోల్‌, శారద ఎనర్జీ అండ్ మినరల్స్ కు చెందిన 60,500 మెట్రిక్ టన్నులు , మొత్తం 87,529 మెట్రిక్ టన్నుల సౌత్ ఆఫ్రికా స్టీమ్ కోల్ లోడ్ తో సౌత్ ఆఫ్రికా లోని రిచర్డ్ బె పోర్ట్ నుంచి షిప్ విశాఖ పోర్ట్ కు చేరుకుందని విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామమోహన్ రావు తెలిపారు.

వాస్తవానికి విశాఖ పోర్టు ట్రస్టు ఇన్నర్ హార్బర్ లో ఇప్పటి వరకు 32.5 మీటర్ల భీమ్ కలిగిన నౌకలను మాత్రమే అనుమతించేందుకు అవకాశం ఉంది. 2019 అక్టోబర్ లో సింగపూర్ లో చేసిన సిమూలేషన్టీ స్టడీ తో విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ ఇన్నర్ హార్బర్లో కి 45 మీటర్ల భీమ్ కలిగిన నౌకలను హ్యాండిల్ చేసేందుకు అవకాశం కలిగిందన్నారు. భారీ నౌకను విశాఖ ఇన్నర్ హార్బర్ లోకి తీసుకు వచ్చేందుకు కృషి చేసిన సిబ్బందికి పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పోర్టు ఈ ఘనతను సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇన్నర్ హార్బర్లో కి మరిన్ని భారీ నౌకలను తీసుకువస్తామని, నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు.

Next Story