- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
తెలంగాణకు భారీ వర్ష సూచన..

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురియనున్నట్టుగా వాతావరణశాఖ హెచ్చరించింది. దక్షిణ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురియనున్నట్టుగా హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 19.3మిమీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 51.7మిమీ వర్షపాతం నమోదవగా అత్యల్పంగా జోగుళాంబ గద్వాలలో 2.7మిమీ వర్షాపాతం నమోదైంది.