డిండి డ్యాం నుంచి భారీగా వరద నీరు లీకేజీ

by  |
డిండి డ్యాం నుంచి భారీగా వరద నీరు లీకేజీ
X

దిశ, దేవరకొండ: దాదాపు పదేండ్ల తర్వాత.. గత వర్షాలకు డిండి డ్యాం నిండుకుండలా మారి 45 రోజులు అలుగు పోయడంతో డిండి వాసులు సంబరపడ్డారు. కానీ ఐబీ అధికారులు డ్యాంకు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఆ సంతోషం ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. గత 3 రోజుల నుంచి భారీగా వరద నీరు లీకు అవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

ఈ విషయమై ఐబీ ఏఈ ఫయాజ్‌ను వివరణ కోరగా… గతంలో కూడా ఇలాగే లీక్ అవ్వడంతో ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని…రైతులు ఇస్తానని అనడంతో సొంత డబ్బులు దాదాపు రూ.30 వేలు పెట్టుకున్నానని అన్నారు. ఇప్పటివరకు ఆ డబ్బు ఎవరూ ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం అవుతున్న లీకేజి సమస్య తన దృష్టికి ఈ రోజే వచ్చిందని లీకేజీని ఆపడానికి లేబర్ సమస్యతో పాటు నిధుల కొరత ఉందని, త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నాడు.



Next Story

Most Viewed