కూంబింగ్ అధికారులకు షాక్.. బార్డర్ లో భారీగా పేలుడు పదార్థాలు..

132

దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టుల కోసం పోలీసులు ఆంధ్రా ఒడిస్సా బార్డర్ లో కూంబింగ్ చేపట్టారు. అయితే కూంబింగ్ కోసం వెల్లిన వారికి భారీగా పేలుడు పదార్థాలు కంటబడ్డాయి. సరిహద్దు ప్రదేశంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగు కనిపించడంతో.. స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అసలు అందులో ఏముందని పోలీసులు తెరిచి చూడగా భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. అందులో నాలుగు టిఫిన్ బాంబులు, 21 వెబ్ బెల్ట్స్, 19 జంగిల్ క్యాప్, మెడిసిన్స్ ఉన్నాయి. బార్డర్ లో ఇలా పేలుడు పదార్థాలు దొరకడం ఈ నెలలోనే ఇది మూడోసారి.