పెరుగుతో వయసు దాచేయోచ్చట

by Disha Web Desk 23 |
పెరుగుతో వయసు దాచేయోచ్చట
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా పెరుగును రోజూ తినడం వలన ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. భారతదేశంలో పెరుగు దాదాపు అన్ని వంటశాలలలో ప్రధానమైనది. గ్రేవీలు, కూరలు, క్రీమ్స్ తయారికి ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని రుచి, ఆరోగ్యానికి చలువ కారణంగా రోజువారీ భోజనంలో గొప్ప అనుబంధాన్ని సంపాదించుకుంది. అయితే ప్రతి రోజూ పెరుగు తింటే అది మనకు అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. పెరుగు తింటే ఎన్ని ప్రయోజనలో తెలుసుకుందాం..

పెరుగు నిత్యం తీసుకుంటే వయసు కనిపించదు. రష్యన్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎలిక్ మెచినికోఫ్ నోబెల్ బహుమతి పొందిన అతను పెరుగుపై పరిశోధనలు చేసి చివరకు చెప్పింది ఏమిటంటే.. రోజూ పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటే వయసు కనిపించదని, శరీరంలోని కణాలకు క్షీణత కనిపించదని తేటతెల్లం చేశారు. రోజూ తినే ఆహారంలో ఉండే రకరకాల రసాయనాలు, అనేక విషపదార్థాలు మన శరీర వ్యాధి నిరోధక శక్తిని ఛిన్నాభిన్నం చేస్తాయి. దాంతో మన కణాలు తొందరగా క్షీణించి తక్కువ వయసులోనే ఎక్కువ వయసు పెరిగిన వారిగా కన్పించేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో పెరుగు ఒక అపర సంజీవినిలా పనిచేస్తుందనటంలో సందేహం లేదు. పెరుగుని రోజూ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెంచటం ద్వారా ఈ ప్రక్రియను అరికట్టవచ్చంటూ ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు చెపుతున్నాయి.

ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..

పెరుగులో కాల్షియం భాస్వరం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి.

పెరుగులో ఓట్స్ క‌లిపి తింటే శరీరానికి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాలకు మేలు చేస్తాయి. ఉక్కపోత వేస్తుంటే నీరు శరీరం నుంచి బయటకు పోతుంది. అప్పుడు మజ్జిగ తాగితే డీహైడ్రేషన్ సమస్యలు ఉండవు. రోజూ పెరుగు తినడం వలన అందులో ఉండే కాల్షియం శరీరంలోనికి చేరి ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడుతుంది. సాధారణ పెరుగులో ఎముకలను బలపరచడానికి ఉపయోగ పడే కాల్షియం ధాతువు ఉంటుంది.


Next Story

Most Viewed