ఇక నకిలీ మందులను కనిపెట్టడానికి QR కోడ్..

by Disha Web Desk 12 |
ఇక నకిలీ మందులను కనిపెట్టడానికి QR కోడ్..
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి పోటి ప్రపంచంలో ఏ కంపేని తయారు చేసే వస్తువులకైన సరే వెంటనే నకిలీ తయారు చేస్తుంటారు. ఒరిజినల్ వస్తువు ఏదో.. నకిలీ వస్తువు ఏదో తెలియడం చాలా కష్టంగా మారింది. ఇది ఏ ఒక్క కంపెనీకి పరిమితం కాదు.. దాదాపు అన్ని కంపెనీలు ఈ నకిలీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మెడిసిన్ తయారీలో ఎక్కువగా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది.

అయితే ఈ సమస్యను అధిగమించేందుకు ఆయా కంపెనీలు తమ ఒరిజినల్ QR కోడ్‌‌ను మందులపై ముద్రించనున్నారు. దీంతో ఇక నకిలీ మందులు కనిపెట్టడం సులభం కానుంది. దీని కోపం దాదాపు 300 మంది అగ్రశ్రేణి ఔషధ తయారీదారులు ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్‌లపై బార్‌కోడ్‌లు లేదా క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌లను ముద్రించాలని బావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది రూ. 100 MRP కంటే ఎక్కువ విక్రయించే యాంటీబయాటిక్స్‌ను చేర్చాలని భావిస్తున్నారు.

Next Story