నానబెట్టిన శనగల నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే ఎన్ని లాభాలో!

by Disha Web Desk 6 |
నానబెట్టిన శనగల నీటిని  ఉదయాన్నే పరగడుపున తాగితే ఎన్ని లాభాలో!
X

దిశ, ఫీచర్స్: చాలా మంది ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో ఉన్న ఆహార పదార్థాల మార్పుల వల్ల అనారోగ్య బారిన పడుతున్నారు. దీంతో పలు రకాల జబ్బులు వచ్చి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ చిన్న వయస్సు వారు కూడా పలు సమస్యలతో ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

దీంతో జనాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంత కష్టమైనా సరే కొన్ని చిట్కాలను పాటిస్తున్నారు. అయితే కొందరు శనగలు నానబెట్టుకుని తినడం చాలా మంచిదని వాటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ప్రతి రోజు తింటుంటారు. శనగలతోనే కాకుండా అవి నానబెట్టిన నీరు పరగడుపున తాగడం వల్ల లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఈ నీరులో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం ఉన్నవారు ఆ సమస్య నుంచి కాస్త ఉపశమనాన్ని కలిగించడంతో కీలక పాత్ర పోషిస్తాయి.

* ఇటీవల చాలా మంది కూర్చుని అన్ని పనులు చేయడానికి ఇష్టపడుతున్నారు. దీంతో అమాంతం బరువు పెరిగిపోయి పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి వారు రాత్రి నానబెట్టిన శనగలు నానబెట్టిన నీరు తాగితే నాజుకుగా తయారవుతారు.

* వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చెక్ పెట్టేలా చేస్తాయి.

* శనగలు నానబెట్టిన నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి చర్మాన్ని సౌందర్యాన్ని పెంచుతాయి.

* శనగలు నానబెట్టిన నీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ మరీ ఎక్కువగా తీసుకోకూడదు. మొదట మీరు ఎంత వరకు తీసుకోగలరో దాన్ని బట్టి కొద్ది మోతాదులో తాగాలి.

Next Story

Most Viewed