కిడ్నీస్టోన్స్‌తో బాధపడుతున్నారా.. ఈ లక్షణాలను అస్సలే అజాగ్రత్త చేయకూడదు!

by Disha Web Desk 8 |
కిడ్నీస్టోన్స్‌తో బాధపడుతున్నారా.. ఈ లక్షణాలను అస్సలే అజాగ్రత్త చేయకూడదు!
X

దిశ, ఫీచర్స్ : కిడ్నీ స్టోన్స్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇది సర్వసాధారణం ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువగా పురుషులలో ఉంటుంది. అయితే ఇలా కిడ్నీల్లో రాళ్లు రావడానికి ముఖ్య కారంణం ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం, మంచి ఆహారం తీసుకోకపోవడం అందువలన వైద్యులు మంచి పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెబుతుంటారు. అంతే కాకుండా కుంటుంబం చరిత్ర వలన కూడా వస్తాయి. అలాగే ఉప్పు అధికంగా తీసుకోవడం వలన కూడా ఈ సమస్య వస్తుంది. ఇక మూత్రపిండాళ్లో రాళ్లు ఉంటే కనిపించే ప్రారంభ లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీల్లో రాళ్లు ఉంటే పొట్ట దిగువన లేదా ఎవగువ భాగంలో శరీరంలో వెనుక భాగంలో విపరీతమైన నొప్పివస్తుంది. మూత్ర విసర్జన చేసే సమయంలో కూడా నొప్పి, ఇబ్బందిగా అనిపించడం జరుగుతుందంట. అంతే కాకుండా మూత్రం రంగు మారడం, వాంతులు, వికారం, చలి జ్వరం లాంటి లక్షణాలు ఏవి కనిపించినా అవి కిడ్నీస్టోన్స్ ప్రారంభ లక్షణాలే అంటున్నారు వైద్యులు. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలే నెగ్లేట్ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలంట. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.

Next Story

Most Viewed