మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాసుకుంటారో తెలుసా?

by Disha Web |
మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాసుకుంటారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: పసుపు వాడకం అనేది భారతీయుల జీవన విధానంలో ఒక భాగం. ఈ కారణంగానే అనేక వ్యాధులు రాకుండా మనల్ని మనం రక్షించుకోగలిగాం. అయితే, పసుపును ఆహారంలోనూ తీసుకుంటాం.. అలంకారంలోనూ తీసుకుంటాం. ఒంటికే కాదు.. ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటాం. ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. అయితే, చాలామందికి మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాసుకుంటారు అనే డౌట్ ఉంటుంది. విషయం ఏమిటంటే.. కాళ్లకు పసుపు రాసుకోవడం అనేది సంప్రదాయ బద్దంగా కొనసాగుతున్న పద్ధతి. ఇది పూర్వం నుంచి మొదలైంది. ఇందులో సైంటిఫిక్ రీజన్ దాగి ఉందని అప్పట్లోనే గుర్తించారు. అప్పటి రోజుల్లో మహిళలు వంటింటిలోనే పనులు చేస్తూ ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చేది. అయితే, ఈ క్రమంలో నీటిలో ఎక్కువ సేపు ఉండండం వల్ల కాళ్లలో పగులు వచ్చి రక్తాలు కారేవి. ఈ కారణంగా పసుపు రాసుకోవడంతో అవి తగ్గేవంట. అదేవిధంగా అలా కాళ్లకు పసుపు రాసుకుంటే భర్త ఆరోగ్యం మంచిగా ఉంటుందని, అంతా మంచి జరుగుతదని నమ్మేవారంట. దీనిని పూర్వీకులు ఓ సంప్రదాయంగా మలిచి కొనసాగించారంట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోందంట.

Next Story